SCREEN ON

Loading File

Chapter 12

Chapter 11
Chapter 12
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 11

Hostel memories

Chapter 12
Chapter 11
Chapter 12

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 12

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

06

Episode 6

07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

Active
12

Episode 12

13

Episode 13

14

Episode 14

15

Episode 15

16

Episode 16

17

Episode 17

Chapter // 11

Episode 11

మరుసటి రోజు ఉదయం...

హాస్టల్ మొత్తం అప్పటికే మేల్కొంది.

ఎక్కడ చూసినా హడావిడి.

ఎవరో బ్రష్ చేస్తూ కారిడార్‌లో తిరుగుతున్నారు.

ఎవరో టవల్ భుజాన వేసుకుని బాత్రూమ్ కోసం పరుగులు పెడుతున్నారు.

ఎవరో యూనిఫాం ఇస్త్రీ చేసుకుంటున్నారు.

మరికొందరు...

గదుల్లో అటు ఇటు తిరుగుతున్నారు.

మొత్తం హాస్టల్ కాలేజ్‌కి వెళ్లడానికి సిద్ధమవుతుంటే...

ఫస్ట్ రూమ్‌లో మాత్రం ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది.

సమీర్ ఇంకా మంచం మీదే పడుకుని ఉన్నాడు.

అది కొత్త విషయం కాదు.

సమీర్ లేట్‌గా లేవడం అందరికీ అలవాటే.

కానీ...

ఆ రోజు ఏదో తేడాగా అనిపించింది.

ఎందుకంటే...

సమీర్ తల నుంచి కాళ్ల వరకు పూర్తిగా దుప్పటి కప్పుకుని ఉన్నాడు.

ఒక్క వెంట్రుక కూడా కనిపించట్లేదు.

దూరం నుంచి చూస్తే...

హాస్టల్ రూమ్‌లో మనిషి కాదు...

ఈజిప్ట్ మ్యూజియంలో పెట్టే మమ్మీ పడుకున్నట్టుంది.

అది చూసిన విజయ్‌కు కాస్త భయం వేసింది.

"ఏంట్రా ఇలా పడుకున్నాడు?"

"బాగానే ఉన్నాడా?"

అని అనుమానం వచ్చింది.

కొద్దిసేపు దూరం నుంచే చూస్తూ నిలబడ్డాడు.

చివరికి ధైర్యం చేసి దగ్గరకు వెళ్లాడు.

అప్పటికే అటుగా వెళ్తున్న శరత్, దినేష్ కూడా ఆగిపోయారు.

ముగ్గురూ సమీర్ మంచం చుట్టూ నిలబడ్డారు.

విజయ్ నెమ్మదిగా దుప్పటి మూల పట్టుకున్నాడు.

"ఏం కాదులే..."

అని తనకుతానే ధైర్యం చెప్పుకున్నాడు.

ఆ తర్వాత ఒక్కసారిగా...

సర్ర్...అని దుప్పటి లాగేశాడు.

అంతే.

ముగ్గురూ ఒకేసారి షాక్ అయ్యారు.

శరత్ చేతిని నోటిమీద పెట్టుకున్నాడు.

దినేష్ కళ్లు పెద్దవయ్యాయి.

విజయ్ రెండు అడుగులు వెనక్కి వెళ్లిపోయాడు.

"ఓడియమ్మా...?!"

అని ముగ్గురూ ఒకేసారి అన్నారు.

ఎందుకంటే...

సమీర్ అప్పటికే పూర్తిగా రెడీ అయిపోయి ఉన్నాడు.

కాలేజ్ యూనిఫాం వేసుకున్నాడు.

షర్ట్ బటన్లు పెట్టుకున్నాడు.

బెల్ట్ కూడా పెట్టుకున్నాడు.

షూస్ కూడా పక్కనే రెడీగా ఉన్నాయి.

అంటే...

వాడు పడుకోలేదు.

రెడీ అయ్యి పడుకున్నాడు!

విజయ్ దుప్పటి లాగడంతో సమీర్ నిద్ర మత్తులో కళ్లు తెరిచాడు.

ఒక పెద్ద ఆవలింత తీసుకున్నాడు.

"హ్మ్మ్..."

అని మంచం మీదే కూర్చున్నాడు.

విజయ్ ఇంకా షాక్‌లోనే ఉన్నాడు.

"రేయ్! ఇదేంట్రా?"

"మాకు తెలియకుండా ఎప్పుడు రెడీ అయ్యిపోయావ్?"

అని అడిగాడు విజయ్.

సమీర్ మరో ఆవలింత తీసుకుంటూ చాలా కూల్‌గా అన్నాడు.

"ఊరుకో మచ్చా..."

"ఉదయం లేచి బ్రష్ చేయాలి..."

"స్నానం చేయాలి..."

"టిఫిన్ తినాలి..."

"డ్రెస్ వేసుకోవాలి..."

"ఇవన్నీ చేయాలంటే ఎంత టైమ్ పడుతుందో తెలుసా?"

అన్నాడు.

ముగ్గురూ నోరు తెరిచి వింటున్నారు.

సమీర్ ఇంకా కొనసాగించాడు.

"అదే రాత్రి పడుకునే ముందే..."

"బ్రష్ చేసేస్తా."

"స్నానం చేసేస్తా."

"అన్నీ కంప్లీట్ చేసుకుని పడుకుంటా."

ఒక్క క్షణం ఆగి...

గర్వంగా అన్నాడు.

"అప్పుడు ఉదయం లేచిన వెంటనే డైరెక్ట్ కాలేజ్‌కి వెళ్లిపోవచ్చు కదా!"

అని మరోసారి ఆవలింత తీశాడు.

రూమ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.

విజయ్, శరత్, దినేష్...

ముగ్గురూ సమీర్ వైపు చూస్తున్నారు.

చూడటానికి వాడు మనిషిలా ఉన్నాడు.

కానీ ఆలోచనలు మాత్రం ఈ లోకానికి చెందినవి కావు.

శరత్ నెమ్మదిగా దినేష్ చెవిలో అన్నాడు.

"మనకు అర్థం కాని స్థాయిలో ఆలోచిస్తున్నాడు."

దినేష్ కూడా తల ఊపాడు.

"ఇది టైమ్ మేనేజ్‌మెంట్ కాదు..."

"ఇది వేరే లెవెల్."

అన్నాడు.

అప్పుడే...

రూమ్ బయట నుంచి అడుగుల శబ్దం వినిపించింది.

కారిడార్‌లో ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు.

కొన్ని క్షణాల తర్వాత...

ఒక సీనియర్ అన్నయ్య రూమ్ తలుపు దగ్గర కనిపించాడు.

ఆయన్ని చూడగానే సమీర్ వెంటనే మంచం మీద నుంచి లేచాడు.

విజయ్ తన కాలర్ సరిచేసుకున్నాడు.

శరత్, దినేష్ కూడా కొంచెం నిటారుగా నిలబడ్డారు.

సీనియర్ అన్నయ్య ముఖంలో మాత్రం చాలా సీరియస్ లుక్ ఉంది.

ఆయన గదిలో ఉన్న వాళ్లందరినీ ఒకసారి చూసి...

నెమ్మదిగా అన్నాడు.

"తమ్ముళ్లు..."

"ఈరోజు రాత్రి ఫుడ్ అయిపోయాక..."

"8:30కి రూమ్ మీటింగ్ ఉంది."

అందరూ శ్రద్ధగా వినడం ప్రారంభించారు.

"అందరూ సంప్రదాయంగా రెడీ అయి రావాలి."

"ఈ విషయం మీ బ్యాచ్ మొత్తం అందరికీ చెప్పండి."

అని చాలా గంభీరంగా చెప్పాడు.

అంతే.

ఆయన తిరిగి వెళ్లిపోయాడు.

రూమ్‌లో మళ్లీ నిశ్శబ్దం నెలకొంది.

మొదట మాట్లాడింది శరత్.

ముఖంలో టెన్షన్.

గుండెల్లో అనుమానం.

"ఏం చేసారురా మళ్లీ మన యదవాళ్లు?"

అన్నాడు.

దినేష్ వెంటనే మంచం మీద కూర్చున్నాడు.

"అంత సీరియస్‌గా చెప్పారంటే..."

"ఈ రాత్రి నిద్ర ఉండదనుకుంటా."

అన్నాడు.

విజయ్ కూడా ఆలోచనలో పడ్డాడు.

హాస్టల్‌లో మీటింగ్ అంటే సాధారణ విషయం కాదు.

ముఖ్యంగా...

సీనియర్లు ఇంత సీరియస్‌గా పిలిస్తే.

ఎక్కడో ఎవరో ఏదో చేసి ఉంటారు.

ప్రశ్న ఒక్కటే...

"ఈసారి ఏ యదవ పని చేసి ఉంటారు?"

అని అందరూ ఒకరినొకరు చూసుకున్నారు.

అయితే...

వాళ్లకు తెలియదు.

ఆ రాత్రి జరిగే మీటింగ్...

సాధారణ మీటింగ్ కాదని.

అది మొత్తం బ్యాచ్ చరిత్రలో గుర్తుండిపోయే సంఘటనగా మారబోతోందని...

Hostel memories

By Writer_aj

Published: June 24, 2026 at 9:16 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...