Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
రాత్రి 8:15 అవుతోంది.
హాస్టల్ మొత్తం ఒక వింత వాతావరణంలో ఉంది.
సాధారణ రోజుల్లో ఈ సమయానికి ఎవరో ఫ్రీ ఫైర్ ఆడుతుంటారు, ఎవరో పాటలు వింటుంటారు, ఇంకెవరో టీ కోసం తిరుగుతుంటారు.
కానీ ఆ రోజు...
అందరి ముఖాల్లో ఒకే భావం.
టెన్షన్.
సీనియర్లు పిలిచిన రూమ్ మీటింగ్ సమయం దగ్గర పడుతోంది.
ఎక్కడ చూసినా హడావిడి.
ఎవరో అద్దం ముందు నిలబడి జుట్టు సరిచేసుకుంటున్నారు.
ఎవరో షర్ట్ కాలర్ నిటారుగా ఉందో లేదో చూసుకుంటున్నారు.
ఎవరో తమ ఫ్రెండ్‌కి,
".. నా బటన్ సరిగ్గా ఉందా?"
అని అడుగుతున్నారు.
అందరూ దాదాపు ఒకే డ్రస్ కోడ్‌లో ఉన్నారు.
ఫుల్ స్లీవ్స్ షర్ట్లు.
చక్కగా ఇన్ చేశారు.
కొంతమంది అలవాటుగా స్లీవ్స్ మడత పెట్టబోతే...
పక్కవాళ్లు వెంటనే హెచ్చరిస్తున్నారు.
"రేయ్! మడత పెట్టొద్దురా!"
"ఈరోజు మీటింగ్ ఉంది."
అందరూ ఒకరిని ఒకరు భయపెడుతున్నారు.
"ఈరోజు కచ్చితంగా ర్యాగింగ్ ఉంటుంది."
"గత బ్యాచ్‌ని రాత్రి రెండు గంటల వరకు నిలబెట్టారట."
"ఒకడిని పాడమన్నారు అంట."
"ఇంకొకడిని డ్యాన్స్ చేయించారట."
ఇలా వినిపించే ప్రతి కథతో...
కొంతమందికి టెన్షన్ పెరుగుతోంది.
చివరికి...
అందరూ సిద్ధమై...
సమయానికి సీనియర్ల రూమ్ ముందు వరుసగా నిలబడ్డారు.
లోపల దాదాపు పది మంది సీనియర్లు కూర్చున్నారు.
నిజానికి వారి బ్యాచ్ మొత్తం ఇరవై మంది.
కానీ...
ఈ పది మంది మాత్రమే ఇలాంటి మీటింగ్స్ నిర్వహించే బాధ్యత తీసుకున్నారు.
ముందుగా సందీప్ తలుపు దగ్గరకు వెళ్లాడు.
చాలా మర్యాదగా నిలబడి,
"లోపలికి రావచ్చా అన్నయ్య?"
అని అడిగాడు.
ఒక సీనియర్ నవ్వుతూ,
"రా తమ్ముడు."
అన్నాడు.
సందీప్ లోపలికి వెళ్లాడు.
అతని వెనక ఇంకొకరు.
మళ్లీ ఇంకొకరు.
అలా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు.
అది గమనించిన ఒక సీనియర్‌కి ఒక్కసారిగా కోపం వచ్చింది.
అతను కింద కూర్చున్న వాళ్లను కూడా లేపేశాడు.
తర్వాత గట్టిగా అరిచాడు.
"ఏంట్రా ఇది?"
"ఒక్కొక్కరు వచ్చి 'మే ఐ కమ్ ఇన్' అంటున్నారు!"
"ఇది క్లాస్‌రూమ్ ఆ?"
"పొండి!"
"అందరూ బయటికి పొండి!"
అంతే.
లోపలికి వచ్చిన వాళ్లందరూ భయంతో మళ్లీ బయటికి పరుగెత్తారు.
ఇంకో సీనియర్ మాత్రం కాస్త శాంతంగా ఉన్నాడు.
అతను సందీప్‌ను పిలిచి,
"మీ వాళ్లందరినీ ఒకేసారి తీసుకుని రా."
"అందరూ వచ్చిన తర్వాత మొదలెడతాం."
అని నెమ్మదిగా చెప్పాడు.
సందీప్ బయటికి వచ్చాడు.
అప్పటికే అతనికి చిరాకు వచ్చేసింది.
"రండి రా బాబూ!"
"ఒక్కసారి రమ్మంటే ఒక్కసారి రండి!"
"మీరందరి వల్ల మళ్లీ బయటికి పంపేశారు!"
అని అందరినీ తిట్టుకుంటూ ఒకచోట చేర్చాడు.
కొద్దిసేపటికి...
మొత్తం బ్యాచ్ ఒకేసారి లోపలికి వెళ్లింది.
ఆ సమయంలో పవన్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడు.
"ర్యాగింగ్" అనే మాటే అతనికి నచ్చదు.
ముఖం చూస్తేనే తెలుస్తోంది.
అది గమనించిన బాలు...
పవన్ చేతి పట్టుకుని నెమ్మదిగా అన్నాడు.
"గొడవ వద్దురా."
"మనమింకా కొత్త వాళ్లం."
"మనకెందుకు ఇవన్నీ?"
పవన్ ఒకసారి సీనియర్ల వైపు చూశాడు.
తర్వాత బాలు వైపు చూశాడు.
చివరికి నిశ్శబ్దంగా వెనక్కి తగ్గాడు.
ఈసారి సీనియర్లు అందరినీ నిలబెట్టారు.
అందరూ వరుసగా నిలబడి ఉన్నారు.
అందులో ఒక సీనియర్ వచ్చి అనిల్ భుజంపై చేయి వేసి అడిగాడు.
"ఎంత మంది ఉన్నారో లెక్కపెట్టి చెప్పు రా."
అనిల్ వెంటనే లెక్కపెట్టడం ప్రారంభించాడు.
అదే సమయంలో ఇంకో సీనియర్ ముందుకు వచ్చాడు.
అతను మాట్లాడటం మొదలుపెట్టగానే...
రూమ్ మొత్తం నిశ్శబ్దమైంది.
"రూమ్‌కి వచ్చేటప్పుడు..."
"కాలర్ ఉన్న షర్ట్ వేసుకోవాలి."
"స్లీవ్స్ మడత పెట్టకూడదు."
"చేతికి వాచ్, బ్రేస్‌లెట్, ఇలా ఏమీ ఉండకూడదు."
"షర్ట్ బటన్లు అన్నీ వేసుకోవాలి."
అందరూ శ్రద్ధగా వింటున్నారు.
"సీనియర్లు రమ్మంటే రావాలి."
"అందరూ కలిసి రావాలి."
"కూర్చోమంటే కూర్చోవాలి."
ఇక్కడ వరకు సరే.
కానీ తర్వాత వచ్చిన మాటకి అందరూ ఆశ్చర్యపోయారు.
"అవసరమైతే..."
"మీ పేరెంట్స్‌తో మాట్లాడటానికి కూడా మా పర్మిషన్ ఉండాలి!"
ఆ మాట విన్న వెంటనే...
వెనక నిలబడి ఉన్న కొందరు ఒకరినొకరు చూసుకున్నారు.
కానీ ఎవరూ నవ్వలేదు.
ఎందుకంటే...
పరిస్థితి సీరియస్‌గా ఉంది.
సీనియర్ ఇంకా ఆగలేదు.
"ఈ ఏరియా చాలా డేంజర్."
"లోకల్ వాళ్లతో గొడవలు వద్దు."
"కాలేజ్‌కి వెళ్లారా?"
"హాస్టల్‌కి వచ్చారా?"
"అంతే."
"డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి!"
అని ఎంతో ఆవేశంగా చెప్పాడు.
అంత చెప్పేసరికి...
అతడికి నిజంగానే ఊపిరి ఆడనట్టైంది.
అదే సమయంలో...
వెనక నిలబడి ఉన్న అజయ్...
సూర్యకి మాత్రమే వినిపించేలా నెమ్మదిగా అన్నాడు.
"ఇంకొన్ని మాటలు చెబితే..."
"ఊపిరి ఆడక పడిపోతాడేమో రా."
"ఇంత బిల్డప్ ఏంటి? బండోడికి "
సూర్యకి మాత్రం అప్పటికే టెన్షన్‌తో చెమటలు పట్టాయి.
"నోరు మూసుకో రా!"
అని కళ్లతోనే చెప్పే ప్రయత్నం చేశాడు.
కానీ ఆలస్యమైంది.
ఎదురుగా ఉన్న సీనియర్...
సూర్య వైపు చూశాడు.
"రే... ఇలా రా."
సూర్య గుండె ఒక్కసారిగా దడదడలాడింది.
"ఎందుకురా మాట్లాడుతున్నావ్?"
అని అడిగాడు.
సూర్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
వెంటనే చేతితో అజయ్‌ని చూపిస్తూ అన్నాడు.
"నేను కాదు అన్నయ్య!"
"అజయ్ గాడు"
అజయ్ షాక్ అయ్యాడు.
అజయ్ అమాయకంగా మొకం పెట్టాడు ఏం తేలినట్టు
సీనియర్ అజయ్ వైపు చూసి అన్నాడు.
"నీకు నేను ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా?"
రూమ్ మొత్తం నిశ్శబ్దం.
సీనియర్ టేబుల్ మీద నుంచి ఒక టూత్‌పిక్ తీసుకున్నాడు.
దాన్ని అజయ్ చేతిలో పెట్టి అన్నాడు.
"ఈ టూత్‌పిక్ తీసుకో."
"ఆ గోడ ఎంత సైజులో ఉందో లెక్కపెట్టు."
"పో."
అజయ్ కి సూర్య చేతిలో ఉన్న టూత్‌పిక్ చూసి...
నవ్వు ఆపుకోవడం చాలా కష్టమైంది.
అతని ముఖం చూసి...
పక్కనే నిలబడి ఉన్న రామకోటి ఒక్కసారిగా నవ్వేశాడు.
అంతే.
ఇప్పుడు సీనియర్ రామకోటి వైపు తిరిగాడు.
"చి..నవ్వుతున్నావా?"
అని అడిగాడు.
తర్వాత ఇంకో టూత్‌పిక్ తీసి అతని చేతిలో పెట్టాడు.
"నువ్వూ వెళ్లు."
"ఇద్దరూ కలిసి రూమ్ సైజు కొలవండి."
అంతే.
ఒక మూలలో...
సూర్య, రామకోటి ఇద్దరూ టూత్‌పిక్స్ పట్టుకుని గోడలు కొలుస్తున్నారు.
మరో మూలలో...
మిగతావాళ్లు నవ్వు ఆపుకోవడానికి ప్రాణాలు పెట్టుకుంటున్నారు.
అజయ్ మాత్రం...
"బతికిపోయా."
అని మనసులో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు.
అలా...
ఆ రూమ్ మీటింగ్ సాగుతూనే సాగింది.
ఒక గంట...
రెండు గంటలు...
మూడు గంటలు...
చివరికి గడియారం 12:49 AM చూపించింది.
అప్పుడే వాళ్లను వదిలారు.
రూమ్ నుంచి బయటికి వచ్చిన జూనియర్లందరికీ ఒకే ఫీలింగ్.
"ఇది మీటింగ్ కాదు..."
"ఇది మినీ శిక్షా శిబిరం!"
అని.
పాపం...
మరుసటి రోజు ఉదయం క్లాస్ ఉందని మాత్రం ఎవరికీ గుర్తులేదు.....
ఎవరికి నిద్ర సరిపోలేదు......
Hostel memories
By Writer_aj
Published: June 24, 2026 at 10:45 AM
Your input calibrates the database for others.
Ready to play...