Loading File
Initializing...
Chapter 17
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
ఉదయం నుంచే హాస్టల్ వాతావరణం ఏదో తేడాగా ఉంది.
ఈరోజు సెమిస్టర్ రిజల్ట్స్.
హాస్టల్ టెర్రస్ మీద గుంపులు గుంపులుగా విద్యార్థులు కూర్చున్నారు.
ఎవరి చేతిలోనో ఫోన్.
ఎవరి ముఖంలోనో టెన్షన్.
ఎవరి మనసులోనో ప్రార్థనలు.
ఒక మూలలో...
పవన్, కిరణ్, రామకోటి, సాయి, వర్ధన్, అర్వింద్ అందరూ కలిసి కూర్చున్నారు.
పవన్ ఆకాశం వైపు చూస్తూ అన్నాడు.
"రేయ్... ఈరోజు రిజల్ట్స్ వస్తాయంట కదా!"
అర్వింద్ వెంటనే మధ్యలో దూకాడు.
"అవును రా!"
"కానీ ముందుగా స్నానం చేసి సైట్ ఓపెన్ చేయాలి."
"అలా చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతావు." అని అన్నాడు.
కిరణ్ నవ్వేశాడు.
"అది ఏ కొత్త టెక్నిక్ రా?"
అర్వింద్ చాలా సీరియస్‌గా అన్నాడు.
"నాకు తెలియదు."
"కానీ ఫెయిల్ అయిన వాళ్లలో తొంభై శాతం మంది స్నానం చేయకుండా రిజల్ట్స్ చూసారని విన్నాను."
అంతే...
అక్కడున్న వాళ్లందరూ పగలబడి నవ్వేశారు.
కానీ...
ఆ నవ్వుల మధ్య ఒక్క వ్యక్తి మాత్రం నవ్వలేదు.
రామకోటి.
అతని ముఖం చూస్తే...
ఫలితాలు కాకుండా కోర్టు తీర్పు రావాల్సి ఉన్నట్టు కనిపిస్తోంది.
గత కొన్ని వారాలుగా అతను చాలా మారిపోయాడు.
ఆ రోజు తెల్లవారుజామున తండ్రి చేసిన ఫోన్ కాల్...
ఇప్పటికీ అతని మనసులో తిరుగుతూనే ఉంది.
"బాగా చదువు నాన్న..."
"నువ్వైనా ఒక ఉద్యోగం సంపాదించాలి..."
అన్న ఆ మాటలు మళ్లీ మళ్లీ గుర్తొస్తున్నాయి.
అతను నిశ్శబ్దంగా కూర్చుని ఉండగానే...
అతని ఫోన్ మోగింది.
స్క్రీన్ మీద...
"నాన్న"
అతని గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుంది.
భయంగానే కాల్ లిఫ్ట్ చేశాడు.
"హలో నాన్న..."
అవతల నుంచి అతని తండ్రి ప్రశాంతంగా అడిగాడు.
"నాన్నా... రిజల్ట్స్ పన్నెండు గంటలకు అంటగా?"
"అవును నాన్న."
"సరే... నీ రోల్ నెంబర్ చెప్పు."
ఆ ఒక్క ప్రశ్నకే రామకోటి గుండెల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది.
కొద్దిసేపు ఆగి...
"30 నాన్న."
అన్నాడు.
అవతల నుంచి అతని తండ్రి నవ్వుతూ అన్నాడు.
"అంత టెన్షన్ పడకు రా."
"నేను అన్నయ్యకి చెప్తా."
"వాడు చూసి నాకు చెప్తాడు."
"తర్వాత నేను నీకు ఫోన్ చేస్తా."
అని చెప్పి కాల్ కట్ చేశాడు.
కాల్ ముగిసిన తర్వాత కూడా రామకోటి ఫోన్ వైపే చూస్తూ ఉండిపోయాడు.
అతని పరిస్థితి గమనించిన వర్ధన్ నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు.
భుజం మీద చెయ్యి వేసి అన్నాడు.
"అంత టెన్షన్ తీసుకోకు రా."
"వచ్చి ఉంటే పాస్ అవుతావు."
"రాకపోతే మళ్లీ రాస్తాం."
"జీవితం అక్కడితో అయిపోదు."
అని ధైర్యం చెప్పాడు.
తర్వాత...
"పద."
"కొంచెం బయట తిరిగి వద్దాం."
అన్నాడు.
రామకోటి కూడా అంగీకరించాడు.
ఇద్దరూ టెర్రస్ నుంచి దిగిపోయి బయటికి నడవడం ప్రారంభించారు.
వాళ్లు దూరంగా వెళ్తుండగా...
టెర్రస్ మీద మిగిలిన వాళ్లందరూ వాళ్లనే చూస్తున్నారు.
అప్పుడే...
బాబూరావు కళ్లను చిన్నగా చేసి వాళ్ల వైపు చూస్తూ అన్నాడు.
"రేయ్... వర్ధన్, రామకోటి ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా?"
పవన్ వెంటనే అన్నాడు.
"మాకు ఎలా వినిపిస్తుంది రా?"
"అంత దూరంలో ఉన్నారు."
బాబూరావు ఛాతీ పొంగించుకుని అన్నాడు.
"మీకు ఒక విషయం తెలియదు."
"నాకు లిప్ రీడింగ్ వచ్చు."
అంతే.
అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా అతని వైపు తిరిగి చూశారు.
అప్పుడే అక్కడికి వచ్చిన అజయ్ అడిగాడు.
"ఏంట్రా?"
"అంత దూరంలో ఉన్న వాళ్ల పెదవులకు కూడా స్కోప్ పెడుతున్నావా?"
అందరూ నవ్వేశారు.
కానీ బాబూరావు మాత్రం తగ్గలేదు.
"టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలి."
"ఇప్పుడు జాగ్రత్తగా వినండి."
అని గొంతు సవరించుకున్నాడు.
దూరంగా నడుస్తున్న వర్ధన్, రామకోటి వైపు చూస్తూ...
"వర్ధన్ ఇలా అంటున్నాడు..."
'రేయ్ రామకోటి...'
'నేను ఎలాగూ కాలేజ్ ఫస్ట్ వస్తాను.'
'అందుకే ఎవరికి తెలియకుండా ముందుగానే నిన్ను ఒక మంచి బిర్యానీ హోటల్‌కి తీసుకెళ్లి పార్టీ ఇస్తాను.'
'ఎవరైనా చూసారంటే మిగతా వాళ్లందరికీ కూడా పార్టీ ఇవ్వాలి.'
'అందుకే సీక్రెట్‌గా వెళ్దాం.'
అని బాబూరావు చాలా నమ్మకంగా చెప్పాడు.
ఒక్క క్షణం నిశ్శబ్దం.
తర్వాత...
పవన్ ఒక్కసారిగా లేచిపోయాడు.
కళ్లల్లో యుద్ధ స్పూర్తి.
చేతిని ముందుకు చాపి గట్టిగా అరిచాడు.
"బాయ్స్ssss....!"
అందరూ అతని వైపు తిరిగారు.
"అందరం వెళ్లాలి!"
"ఆడు పొరపాటున కాలేజ్ ఫస్ట్ అయినా..."
"వాడి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో కావాలి!"
"Attackkk!"
అంతే.
ఒక్కసారిగా అక్కడున్న వాళ్లందరూ లేచిపోయారు.
కిరణ్ వెంటనే పరిగెత్తాడు.
అర్వింద్ నవ్వుకుంటూ వెళ్లాడు.
సాయి, పవన్, బాబూరావు...
అందరూ గుంపుగా వర్ధన్, రామకోటి వైపు దూసుకెళ్లారు.
దూరంగా నడుస్తున్న వర్ధన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు.
ఆ ఐదుగురు వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు.
వర్ధన్ షాక్ అయ్యాడు.
"రేయ్!"
"వీళ్లందరూ ఎందుకు వస్తున్నారు?"
రామకోటి కూడా వెనక్కి తిరిగి చూశాడు.
"నాకేం తెలుసు రా!" అని అన్నాడు రామకోటి ....
అక్కడికి వచ్చిన బాబూరావు ఇలా అన్నాడు " పదండి బిర్యాని కే కదా !" అని అన్నాడు ,
కానీ వర్ధన్ కి ఏం అర్థం కాలేదు !
" ఏం బిర్యాని ?" అని అడిగాడు అప్పుడు బాబూరావు కి వెంటనే భయం వేసింది వెనుక చూస్తే వల్ల మాటలు విన్న పవన్ , సాయి, అరవింద్, కిరణ్ లు వస్తున్నారు ఇప్పుడు వర్ధన్ రామకోటి లు హోటల్ కి వెళ్ళడం లేదు అని తెలిస్తే బాబూరావు నీ కొడతారు ....అందుకే బాబూరావు వర్ధన్ నీ బ్రతిమాలి జరిగినది అంతా చెప్పేశాడు , సరే అని బిర్యాని తినడానికే వెళ్తున్న అని వర్ధన్ అందరికీ అబద్ధం చెప్పాడు పాపం....
బాబూరావు మాత్రం సేఫ్ .....
Hostel memories
By Writer_aj
Published: June 25, 2026 at 8:45 AM
Your input calibrates the database for others.
Ready to play...