Loading File
Initializing...
Chapter 9
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
స్టడీ అవర్స్ పేరుతో హాస్టల్ మొత్తం తన తన పనుల్లో బిజీగా ఉంది.
ఎవరో నిజంగా చదువుతున్నారు...
ఎవరో చదువుతున్నట్టు నటిస్తున్నారు...
ఎవరో ఫ్రీ ఫైర్‌లో దేశాన్ని కాపాడుతున్నారు...
మరి ఇంకొందరు...
ప్రేమ సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు.
ఆ రాత్రి కిరణ్ ఫోన్ వైబ్రేట్ అయ్యింది.
స్క్రీన్ మీద పేరు కనిపించగానే అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది.
వెంటనే చుట్టూ ఒకసారి చూసుకున్నాడు.
ఎవరూ గమనించట్లేదనుకుని...
నెమ్మదిగా కుర్చీ నుండి లేచి బయటికి వచ్చాడు.
"ఎవరికి తెలియకుండా మాట్లాడాలి..."
అనే ఉద్దేశంతో మెట్లు ఎక్కి టెర్రస్ పైకి వెళ్లాడు.
కానీ...
అక్కడికి వెళ్లి చూసేసరికి...
టెర్రస్ మూలలో మహేష్ ఒక్కడే నిలబడి ఉన్నాడు.
చల్లటి గాలి వీస్తోంది.
కానీ మహేష్ ముఖం మాత్రం మబ్బులు కమ్ముకున్న ఆకాశంలా కనిపిస్తోంది.
చేతులు జేబుల్లో పెట్టుకుని ఎక్కడికో చూస్తున్నాడు.
అది చూసిన కిరణ్ దగ్గరికి వెళ్లి అడిగాడు.
"ఏమైంది రా? అలా ఉన్నావ్?"
మహేష్ నిట్టూర్చాడు.
"ఏం లేదు రా..."
అని మొదలుపెట్టి...
"తనతో చిన్న గొడవ."
"అసలు తనని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు."
"ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది."
అన్నాడు.
ఆ మాట విన్న కిరణ్ వెంటనే నవ్వేశాడు.
భుజంపై చెయ్యి వేసి,
"అయ్యో! ఈ మాత్రం దానికేనా?"
"ఇది అసలు సమస్యే కాదు."
"నన్ను చూసి నేర్చుకో."
అన్నాడు.
ఆ మాట విన్న మహేష్ మనసులో మాత్రం...
"నిన్ను చూసి నేర్చుకోవాలా?"
అని అనుకున్నాడు.
కానీ బయటకు ఏమీ అనలేదు.
అంతలో కిరణ్‌కి వచ్చిన మిస్డ్ కాల్‌కి తిరిగి కాల్ చేశాడు.
ఫోన్ అవతల ఉన్న అమ్మాయి లిఫ్ట్ చేసింది.
కిరణ్ వెంటనే మృదువైన గొంతుతో,
"సారీ అమ్మా..."
"టెర్రస్ మీదికి రావడానికి లేట్ అయింది."
"కింద మా యదవాళ్లు వింటే మళ్లీ గోల చేస్తారు అని పైకి వచ్చా."
అన్నాడు.
ఆ మాట విన్న మహేష్ మనసులో ఒక్కటే ఆలోచన.
"మేమా యదవాళ్లు?"
అని.
ఫోన్ అవతల అమ్మాయి నవ్వుతూ అంది.
"ఇట్స్ ఓకే రా."
"ఇదేం పెద్ద విషయం కాదు కదా."
"ఎందుకు అంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావ్?"
"నేను నిన్ను అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా?"
అని అడిగింది.
అది విన్న మహేష్ మనసులో,
"తక్కువోడివి ఏం కాదురా బాబు నువ్వు..."
అని అనుకున్నాడు.
కానీ...
కిరణ్ మాత్రం ఆ మాటలకు కరిగిపోయాడు.
ముఖం మొత్తం నవ్వుతో నిండిపోయింది.
అప్పుడే...
ఇంకో కాల్ వచ్చింది.
స్క్రీన్ మీద ఇంకో పేరు మెరిసింది.
దాన్ని చూసిన కిరణ్ ఒక్క క్షణం ఆలోచించి...
ప్రస్తుతం లైన్‌లో ఉన్న అమ్మాయితో అన్నాడు.
"నిత్య..."
"మా గ్రానీ ఎందుకో కాల్ చేస్తుంది."
"నేనే నీకు మళ్లీ చేస్తా."
అన్నాడు.
కానీ...
కాల్ చేసింది అసలు గ్రానీ కాదు.
ఇంకో అమ్మాయి.
మహేష్ కళ్ల ముందే...
కిరణ్ రెండో కాల్ లిఫ్ట్ చేశాడు.
"బేబ్... సారీ!"
"మా అమ్మమ్మతో మాట్లాడుతున్నా."
"అందుకే వెంటనే లిఫ్ట్ చేయలేకపోయా."
అన్నాడు.
అవతల నుండి వెంటనే సమాధానం వచ్చింది.
"పర్లేదు లే కిరణ్."
"నీ గురించి నాకు ఆ మాత్రం తెలియదా?"
అంది.
అది విన్న మహేష్ మెదడు కొన్ని క్షణాలు పనిచేయడం ఆపేసింది.
తనతో తానే అనుకున్నాడు.
"ఒక్క అమ్మాయితోనే నాకు ఇంత కష్టంగా ఉంది."
"ఈ కిరణ్ గాడు ఇద్దరిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడురా బాబు?"
అలా అనుకుంటూనే...
వాడి మాటలు వింటూ టైమ్ పాస్ చేయడం మొదలుపెట్టాడు.
ఒక గంట...
రెండు గంటలు...
మూడు గంటలు...
మహేష్‌కి ఇప్పుడు ప్రేమ సమస్య కంటే పెద్ద సమస్య వచ్చింది.
నిద్ర.
గడియారం చూసాడు.
1:20 AM
టెర్రస్ పైకి వచ్చి దాదాపు మూడు గంటలు అయిపోయింది.
మహేష్ నిద్రతో కళ్లు మూసుకుపోతున్నాయి.
"రా... కిందకి వెళ్దాం."
అన్నాడు.
కిరణ్ ఫోన్ చెవికి పెట్టుకునే,
"ఒక ఫైవ్ మినిట్స్ రా."
అన్నాడు.
ఆ ఫైవ్ మినిట్స్...
గంట అయ్యింది.
చివరికి మహేష్ విసిగిపోయాడు.
"ఇంకా వీడి కోసం వెయిట్ చేస్తే ఉదయం అవుతుంది."
అని అనుకున్నాడు.
కిందికి ఒక్కడే వెళ్లడానికి భయం వేసినా...
ఎలాగో ధైర్యం చేసి మెట్లు దిగాడు.
మొదట ఫస్ట్ రూమ్‌లోకి వెళ్లాడు.
అక్కడ ఒక బెడ్ ఖాళీగా కనిపించింది.
"హమ్మయ్య!"
"ఇక్కడే పడుకుందాం."
అని అనుకున్నాడు.
లైట్ ఆఫ్ చేశాడు.
అంతే.
ఎక్కడి నుంచో ఒక్కసారిగా పవన్ గట్టిగా అరిచాడు.
"ఎవడ్రా లైట్ ఆఫ్ చేసిన ******!"
మహేష్ గుండె ఒక్కసారిగా ఆగినట్టైంది.
వెంటనే లైట్ ఆన్ చేశాడు.
ఒక్క మాట కూడా మాట్లాడకుండా...
ఆ రూమ్ నుంచి పారిపోయాడు.
ఇప్పుడు సెకండ్ రూమ్‌లోకి వెళ్లాడు.
అక్కడ అప్పటికే లైట్లు ఆఫ్ ఉన్నాయి.
"హమ్మయ్య!"
"ఇక్కడ అయితే అందరూ పడుకున్నారు."
అని సంతోషించాడు.
చీకట్లో జాగ్రత్తగా ఒక ఖాళీ బెడ్ వెతుక్కుంటూ ముందుకు వెళ్లాడు.
అప్పుడే... "టట్ టట్ టట్ టట్!"
"బూమ్!"
"హెడ్‌షాట్!"
అంటూ ఫ్రీ ఫైర్ సౌండ్స్ వినిపించాయి.
మహేష్ షాక్ అయ్యాడు.
ఇంకాస్త ముందుకు వెళ్తే...
చీకట్లో మొత్తం గేమర్స్ రాజ్యం నడుస్తోంది.
సరే...
ఎలాగో అడ్జస్ట్ అయి పడుకున్నాడు.
అప్పుడే వెనకనుండి...
"రే! నీ వెనక ఉన్నాడు!"
"ఏసేయ్ నా కొడుకుని!"
"స్కోప్ కరో!"
అంటూ గోల మొదలైంది.
ఆ గోలలో నిద్ర పడటం అసాధ్యం.
మహేష్ మళ్లీ లేచాడు.
అప్పుడే సూర్య గొంతు వినిపించింది.
"బెర్ముడా ఊపిరి పీల్చుకో..."
"ఈ సూర్య గాడు వస్తున్నాడు!"
అని ఎక్కడో గేమ్‌లో అరిస్తున్నాడు.
మహేష్ తల పట్టుకున్నాడు.
" ఇక్కడ కూడా పని లేదు."
అని అనుకుని...
మూడో రూమ్ వైపు బయలుదేరాడు.
అక్కడ...
అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
మూలలో గుండన్న పడుకున్నాడు.
నిజానికి...
ఫస్ట్ రూమ్‌లో గురక పెట్టాడని పవన్ వాడిని అక్కడి నుండి తరిమేశాడు.
ఇప్పుడు గుండన్న మూడో రూమ్‌లో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.
అతని పక్కనే మంచి ఖాళీ స్థలం కనిపించింది.
మహేష్ ఆనందపడ్డాడు.
"దేవుడా... చివరికి ఒక మంచం దొరికింది."
అని అనుకుని...
వెళ్లి గుండన్న పక్కనే పడుకున్నాడు.
ఆ రాత్రి...
కిరణ్ ఇంకా టెర్రస్ మీద ఫోన్‌లోనే ఉన్నాడు.
ఫస్ట్ రూమ్‌లో పవన్ ఇంకా లైట్ల మీద కోపంగా ఉన్నాడు.
సెకండ్ రూమ్‌లో ఫ్రీ ఫైర్ యుద్ధం కొనసాగుతోంది.
మహేష్ మాత్రం...
మూడు రూములు తిరిగి...
చివరికి గుండన్న పక్కన ఆశ్రయం దొరికిన శరణార్థిలా...
కళ్లూ మూసుకున్నాడు.
కానీ...
అతనికి తెలియదు.
గుండన్న గురక ఇంకా స్టార్ట్ కాలేదు...
Hostel memories
By Writer_aj
Published: June 23, 2026 at 11:49 AM
Your input calibrates the database for others.
Ready to play...