SCREEN ON

Loading File

Chapter 14

Chapter 13
Chapter 14
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 13

Hostel memories

Chapter 14
Chapter 13
Chapter 14

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 14

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

06

Episode 6

07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

12

Episode 12

13

Episode 13

Active
14

Episode 14

15

Episode 15

16

Episode 16

17

Episode 17

Chapter // 13

Episode 13

రాత్రి చాలా ఆలస్యంగా పడుకున్న బ్యాచ్.

రూమ్ మీటింగ్ అయిపోయేసరికి దాదాపు ఒంటి గంట దాటిపోయింది.

అందరూ రూమ్‌లకు చేరుకుని ఎక్కడ పడితే అక్కడ పడిపోయారు.

ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు.

శరీరం అలసిపోయింది.

కళ్లు మూసుకున్న వెంటనే నిద్రలోకి జారిపోయారు.

సమయం...

ఉదయం 4:30.

హాస్టల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది.

ఫ్యాన్లు తిరిగే శబ్దం తప్ప ఇంకేం

వినిపించడం లేదు.

ఎవరో గురక పెడుతున్నారు.

ఎవరో దుప్పటి తన్నేసి పడుకున్నారు.

ఎవరో మంచం మీద అడ్డంగా పడ్డారు.

అలాంటి సమయంలో...

ఒక్కసారిగా ఒక ఫోన్ మోగింది.

ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఆ రింగ్‌టోన్...

రూమ్ మొత్తం మారుమోగించింది.

ఆ ఫోన్...

రామకోటిదే.

కానీ రామకోటి మాత్రం గాఢ నిద్రలో ఉన్నాడు.

అంత సులభంగా లేచే పరిస్థితి కాదు.

అయితే...

ఆ ఫోన్ శబ్దానికి పక్కనే పడుకున్న దత్త వినయ్ ఒక్కసారిగా లేచాడు.

కళ్లు సగం తెరిచి...

చిరాకుగా చుట్టూ చూసాడు.

"నీయబ్బా..."

"ఎవడ్రా అలారం పెట్టింది?"

"బొక్కలాగా..."

అని విసుక్కున్నాడు.

తర్వాత శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూసాడు.

రామకోటి దుప్పటి కప్పుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.

ఫోన్ మాత్రం పక్కనే మోగుతోంది.

వినయ్‌కి ఇంకా కోపం వచ్చింది.

"ఇంత పెద్ద శబ్దం వస్తున్నా లేవడా వీడు?"

అని అనుకుని...

ఒక చిన్న తన్ను తన్నాడు.

అంతే.

రామకోటి ఉలిక్కిపడి లేచాడు.

"ఏంటి?! ఏం జరిగింది?!"

అని కంగారుగా అడిగాడు.

వినయ్ ఫోన్ వైపు చూపించాడు.

"రే..."

"మీ నాన్న ఫోన్ చేస్తున్నారు."

"ఈ టైంలో కాల్ చేస్తున్నారంటే ఏదో ఎమర్జెన్సీ అనుకుంటా."

అన్నాడు.

ఆ మాట విన్న రామకోటికి కూడా కాస్త ఆందోళన వేసింది.

వెంటనే ఫోన్ తీసుకున్నాడు.

రూమ్‌లో అందరి నిద్ర పాడవకుండా ఉండాలని...

నెమ్మదిగా బయటికి వచ్చాడు.

మెట్లు ఎక్కి టెర్రస్ పైకి వెళ్లాడు.

చల్లటి గాలి వీస్తోంది.

ఆకాశం ఇంకా చీకటిగానే ఉంది.

తూర్పు దిక్కున చిన్న వెలుగు కూడా కనిపించడం లేదు.

రామకోటి కాల్ లిఫ్ట్ చేశాడు.

"హలో నాన్న..."

అన్నాడు.

అవతల నుంచి వెంటనే తన తండ్రి గొంతు వినిపించింది.

"నాన్నా..."

"పడుకున్నావా?"

అని అడిగాడు వాళ్ళ నాన్న

ఆ ప్రశ్న విని రామకోటికి చిరాకు వచ్చింది.

"అవును నాన్న!"

"ఈ టైంలో ఫోన్ చేసి అలా అడుగుతున్నావేంటి?"

అన్నాడు.

అవతల కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

తర్వాత అతని తండ్రి నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు.

"ఏం లేదు నాన్న..."

"మీకు ఈ టైంలో స్టడీ అవర్స్ ఉంటాయని చెప్పావు కదా."

రామకోటి మౌనంగా వింటున్నాడు.

"నువ్వు బాగా చదువు నాన్న."

"పాస్ అవ్వు."

"మంచి ఉద్యోగం తెచ్చుకో."

అతని గొంతులో ఏదో విచిత్రమైన బాధ ఉంది.

"నేను కూడా..."

"ఇక ముందు లాగా కష్టపడలేకపోతున్నాను నాన్న..."

అన్నాడు.

ఆ మాట విన్న రామకోటి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు.

ఇప్పటివరకు తన తండ్రి ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు.

ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు.

ఎప్పుడూ ధైర్యం చెప్పేవాడు.

కానీ ఈరోజు...

ఆ మాటల్లో ఏదో అలసట ఉంది.

ఏదో బాధ ఉంది.

రామకోటికి ఒక్కసారిగా భయం వేసింది.

"ఏమైంది నాన్న?"

"ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నావేంటి?"

అని అడిగాడు.

అవతల మళ్లీ చిన్న నిశ్శబ్దం.

తర్వాత...

"ఏం లేదు నాన్న."

"ఎందుకో నీతో మాట్లాడాలి అనిపించింది."

అన్నాడు.

"సరే..."

"నువ్వు పడుకో."

"నాకు ఇంకా చాలా పనులున్నాయి."

అని చెప్పాడు.

అప్పుడు మాత్రమే రామకోటికి గమనించింది.

తన తండ్రి ఇంటి నుంచి కాదు...

పొలం నుంచి మాట్లాడుతున్నాడు.

ఉదయం ఐదు గంటలు కూడా కాలేదు.

కానీ అప్పటికే పొలంలో పని మొదలుపెట్టాడు.

ఆలోచించకుండానే రామకోటి గొంతు బరువైంది.

"సరే నాన్న..."

అన్నాడు.

ఫోన్ కట్ అయిపోయింది.

టెర్రస్ మీద మళ్లీ నిశ్శబ్దం.

కానీ...

రామకోటి మనసులో మాత్రం తుఫాను మొదలైంది.

ఇప్పటి వరకు అతని జీవితం చాలా సింపుల్.

కాలేజ్‌కి వెళ్లాలనిపిస్తే వెళ్తాడు.

లేకపోతే అజయ్, సూర్యతో కలిసి హాస్టల్‌లో తిరుగుతాడు.

చికెన్ కోసం గొడవలు.

ఫ్రీ ఫైర్ కోసం యుద్ధాలు.

రాత్రంతా కబుర్లు.

అలా రోజులు గడిచిపోయాయి.

కానీ...

ఆ ఒక్క ఫోన్ కాల్ తర్వాత...

మొదటిసారి తన జీవితాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.

తనకు ఇప్పటికే సప్లైలు ఉన్నాయి.

కాలేజ్‌కి సరిగ్గా వెళ్లడం లేదు.

చదువు కూడా పెద్దగా లేదు.

తన జీవితానికి స్పష్టమైన లక్ష్యం కూడా లేదు.

ఇప్పటి వరకు ఇవేవీ అతనికి సమస్యగా అనిపించలేదు.

కానీ...

ఈరోజు...

తన తండ్రి మాటలు గుర్తొస్తున్నాయి.

పొలంలో ఒంటరిగా పని చేస్తున్న ఆ మనిషి గుర్తొస్తున్నాడు.

తన కోసం కష్టపడుతున్న ఆ చేతులు గుర్తొస్తున్నాయి.

అజయ్, సూర్యలతో గడిపిన సరదా క్షణాల మధ్య...

ఎప్పుడూ దూరంగా నెట్టేసిన ఒక ప్రశ్న ఇప్పుడు అతని ముందు నిలబడింది

"ఇలాగే ఇంకా ఎంతకాలం?"

రామకోటి టెర్రస్ గోడ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు.

ఆకాశం వైపు చూశాడు.

తూర్పు దిక్కున తెల్లవారుతోంది.

హాస్టల్ ఇంకా నిద్రలోనే ఉంది.

కానీ...

ఆ ఉదయం మాత్రం రామకోటికి నిద్ర తిరిగి రాలేదు.

తెల్లవారే వరకు...

అతడు టెర్రస్ మీద ఒంటరిగా కూర్చుని ఉన్నాడు.

మొదటిసారి...

భవిష్యత్తు అనే మాట అతన్ని భయపెట్టింది.

మొదటిసారి...

తన జీవితాన్ని గురించి నిజంగా ఆలోచించడం ప్రారంభించాడు.

కొన్ని ఫోన్ కాల్స్ జీవితాన్ని మార్చవు.

కానీ...

కొన్ని ఫోన్ కాల్స్ మనం ఎంతకాలంగా తప్పించుకుంటున్న నిజాన్ని మాత్రం ఎదురుగా నిలబెడతాయి.

ఆ ఉదయం రామకోటికి వచ్చిన కాల్...

అలాంటిదే.

Hostel memories

By Writer_aj

Published: June 24, 2026 at 11:33 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...