SCREEN ON

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

06

Episode 6

Active
07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

12

Episode 12

13

Episode 13

14

Episode 14

15

Episode 15

16

Episode 16

17

Episode 17

18

Episode 18

19

Episode 19

20

FINAL EPISODE "20"✨

Chapter // 06

Episode 6

Writer_aj
Fantasy - friendship
1 Min Read
Pub: Jun 14, 2026

రాత్రి సమయం.

మెస్‌లో భోజనాలు ముగిశాయి.

రోజంతా వేడిలో ఉడికిపోయిన విద్యార్థులంతా ఇప్పుడు హాస్టల్ టెర్రస్‌పైకి చేరుకున్నారు. చల్లని గాలి కోసం కొందరు అటూ ఇటూ నడుస్తున్నారు. ఇంకొందరు గుంపులుగా కూర్చుని కబుర్లు చెబుతున్నారు. మరికొందరు ఫోన్లలో మునిగిపోయి తమ తమ ప్రపంచాల్లో తేలిపోతున్నారు.

కానీ...

మన అర్వింద్ మాత్రం అందరికీ దూరంగా టెర్రస్ లో ఒక మూలలో కూర్చున్నాడు.

చెవుల్లో ఇయర్‌ఫోన్స్.

ఫోన్‌లో తనకు ఇష్టమైన పాటలు.

పైన వెన్నెల.

ముఖానికి తాకుతున్న చల్లటి గాలి.

ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ కూర్చున్నాడు.

అలాంటి సమయంలో...

కొంచెం దూరంలో కిరణ్ ఎవరోతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.

మాట్లాడుతూనే అర్వింద్ వైపు చూసాడు.

అర్వింద్ కూడా అతడిని గమనించాడు.

కిరణ్ చేతిని ఊపుతూ,

"హాయ్ రా!"

అని పలకరించాడు.

కానీ అర్వింద్ చెవుల్లో సంగీతం గట్టిగా వినిపిస్తుండటంతో అతడు ఏమన్నాడో వినిపించలేదు.

"వినిపించట్లేదేమో" అనుకుని కిరణ్ మళ్లీ తన కాల్‌లో మునిగిపోయాడు.

అయితే...

అర్వింద్‌కు ఆసక్తి ఎక్కువ.

"ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం" అనుకుని మెల్లగా తన ఫోన్‌లోని మ్యూజిక్ ఆపేశాడు.

ఇప్పుడు కిరణ్ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

ఫోన్‌లో కిరణ్ ఎంతో ప్రేమగా చెబుతున్నాడు.

> "నువ్వు ఎలా అంటే అల కుట్టీ... నా బంగారమే నువ్వు! లవ్ యూ సో మచ్!"

ఆ మాటలు వినగానే అర్వింద్ కళ్లూ పెద్దవయ్యాయి.

మనసులోనే అనుకున్నాడు.

"అమ్మదీనమ్మా! ఈడికి కూడా లవ్ సెట్ అయిందా? నోట్లో వేలు పెడితే కొరకలేనట్టు అమాయకంగా తిరుగుతుంటాడు... వీడు కూడా ఇంత పని చేస్తున్నాడా!"

అని ఆశ్చర్యపోయాడు.

ఇంతటితో ఆగలేదు.

కిరణ్ ఒకసారి చుట్టూ చూసుకున్నాడు.

ఎవరూ చూడటం లేదనుకున్నాడు.

అంతే...

ఫోన్‌కి దగ్గరగా వాలి ఒక ముద్దు కూడా పెట్టేశాడు.

అది చేసిన వెంటనే తనలో తానే సిగ్గుపడుతూ నవ్వుకున్నాడు.

తర్వాత పక్కకి తిరిగి చూశాడు.

అక్కడ...

అర్వింద్.

నోరు తెరిచి.

కళ్లూ పెద్దవిగా చేసి.

అతడినే చూస్తూ నిలబడి ఉన్నాడు.

కొన్ని క్షణాలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.

తర్వాత అర్వింద్ నోటిమీద చెయ్యి పెట్టుకుని ఆశ్చర్యంగా అన్నాడు.

"అవ్వువ్వా! ఏంట్రా నువ్వు చేస్తున్నది?"

కిరణ్ ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది.

సిగ్గుతో నవ్వుకుంటూ,

"చూసింది మర్చిపో మావా!"

అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆగకుండా మెట్లవైపు పరుగెత్తి కిందికి వెళ్లిపోయాడు.

అర్వింద్ మాత్రం ఇంకా షాక్‌లోనే ఉన్నాడు.

"ఇవాళ టెర్రస్ మీద ఏదో వింత జరుగుతోంది" అనుకుంటుండగానే...

మరోవైపు తన రూమ్‌మేట్ చిన్ని కనిపించాడు.

చిన్ని కూడా ఫోన్‌లో ఎవరోతో మాట్లాడుతున్నాడు.

అది చూసిన అర్వింద్ మళ్లీ అనుమానంగా చూశాడు.

"ఇంకో ప్రేమకథ దొరికినట్టుంది. ఈడు ఎవరితో మాట్లాడుతున్నాడో చూద్దాం."

అనుకుని నెమ్మదిగా దగ్గరికి వెళ్లాడు.

కానీ దగ్గరికి వెళ్లాక తెలిసింది.

చిన్ని మాట్లాడుతున్నది తన అమ్మతో.

"అమ్మ... భోజనం చేశా."

"అవును అమ్మ... బాగానే ఉన్నా."

"అవును... రేపు కాలేజ్‌కి వెళ్తా."

అని చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు.

అది చూసిన అర్వింద్ మనసులో అనుకున్నాడు.

"ఎంతైనా చిన్ని గాడు నిప్పురా! అందరూ ప్రేమల్లో పడిపోతుంటే వీడు మాత్రం అమ్మతో మాట్లాడుతున్నాడు."

అని గౌరవంగా తల ఊపాడు.

అయితే...

అది కేవలం కొన్ని సెకన్లే.

ఎందుకంటే...

అదే సమయంలో పరిగెత్తుకుంటూ పక్క రూమ్‌లో ఉండే సాయి వచ్చాడు.

వచ్చీ రాగానే ఊపిరి పీల్చుకుంటూ అరిచాడు.

"ఒరేయ్ చిన్ని!"

చిన్ని ఆశ్చర్యంగా తిరిగి చూశాడు.

సాయి కోపంగా అన్నాడు.

"కింద రూమ్ వాళ్లతో గేమ్ ఆడాం రా! నన్ను చిత్తు చేశారు! 0-7 తో ఓడిపోయా!"

అని బాధగా చెప్పాడు.

తర్వాత మరింత కోపంగా,

"ఇప్పుడు టూ వర్సెస్ టూ మ్యాచ్‌కు ఛాలెంజ్ చేశారు. ఎవర్నైనా తీసుకురా అంటున్నారు. నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు మావా!" అని

అన్నాడు.

ఆ మాట విన్న క్షణంలో...

చిన్ని ముఖం మారిపోయింది.

ఇప్పటి వరకు అమ్మతో మృదువుగా మాట్లాడుతున్న అబ్బాయి...

ఒక్కసారిగా యుద్ధానికి పిలుపు వచ్చిన వీరుడిలా మారిపోయాడు.

"అమ్మ... నేను మళ్లీ చేస్తా."

అని వెంటనే ఫోన్ కట్ చేశాడు.

తర్వాత సాయి వైపు తిరిగి,

> "ఎవడ్రా నన్ను తక్కువ చేసి మాట్లాడింది?"

అని అడిగాడు.

ఆ కళ్లలో కనిపించిన ఫైర్ చూసి సాయికే కాసేపు భయం వేసింది.

ఇద్దరూ వేగంగా మెట్లవైపు నడిచారు.

అది అంతా చూసిన అర్వింద్ మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు.

కొద్ది సేపటి క్రితం అమ్మతో ఎంతో అమాయకంగా మాట్లాడిన చిన్ని...

కొన్ని సెకన్లలోనే యుద్ధానికి వెళ్తున్న కమాండర్‌లా మారిపోయాడు.

అర్వింద్‌కు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు.

ఆకాశం వైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు.

"ఈ హాస్టల్‌లో ఎవరి అసలు రూపం ఏంటో తెలుసుకోవడం చాలా కష్టం రా బాబూ..."

అని తల ఊపాడు.

టెర్రస్ మీద చల్లని గాలి ఇంకా వీచుతూనే ఉంది...

కానీ ఆ రాత్రి అర్వింద్ చూసిన సన్నివేశాలు మాత్రం అతని మైండ్‌లో చాలాసేపు తిరుగుతూనే ఉన్నాయి....

Hostel memories

By Writer_aj

Published: June 23, 2026 at 4:50 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...