SCREEN ON

Loading File

Chapter 6

Chapter 5
Chapter 6
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 5

Hostel memories

Chapter 6
Chapter 5
Chapter 6

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 6

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

Active
06

Episode 6

07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

12

Episode 12

13

Episode 13

14

Episode 14

15

Episode 15

16

Episode 16

17

Episode 17

Chapter // 05

Episode 5

సాయంత్రం అయిదున్నర దాటింది.

కాలేజ్ బెల్ కొట్టగానే, రోజు మొత్తం క్లాసుల్లో కూర్చుని బోర్లాపడిన విద్యార్థులంతా గుంపులు గుంపులుగా తమ తమ హాస్టళ్ల వైపు నడుస్తున్నారు. అందరి ముఖంలోను అలసట, చేతుల్లో నోట్స్, ఇంకొందరి మొకం లో మాత్రం "రేపు అసైన్‌మెంట్ సబ్మిట్ చేయాలి" అనే భయం.

కానీ...

అందరూ అలా కాలేజ్‌కి వెళ్లరు కదా!

హాస్టల్‌లోనే రాజుల్లా జీవించే ఒక ప్రత్యేక జాతి ఉంటుంది.

ఆ జాతికి ప్రతినిధులుగా నిలిచిన ముగ్గురు మహానుభావులు...

అజయ్, సూర్య, రామకోటి.

ఆ రోజు కూడా కాలేజ్‌కి డుమ్మ్ కొట్టి, హాస్టల్ భవనం మీద నిలబడి కింద నుంచి వస్తున్న విద్యార్థులను చూస్తూ నవ్వుకుంటున్నారు.

అజయ్ చేతులు వెనక్కి పెట్టుకుని, గొప్ప తత్వవేత్తలా నిలబడి కింద చూస్తూ అన్నాడు.

"ఒరేయ్ మావా... వీళ్లందరూ కాలేజ్‌కి వెళ్లి బొక్క రా! ఒక్క రోజు ఎంత విలువైనదో కూడా తెలియదు వీళ్లకి. అదే మనమైతే..."

అని ఏదో గొప్ప డైలాగ్ చెప్పబోతూ మధ్యలో ఆగిపోయాడు.

రామకోటి వెంటనే ఆసక్తిగా అడిగాడు.

"ఏంట్రా ఆగిపోయావ్? చెప్పు!"

అజయ్ నోరు తెరవకముందే రామకోటి తనే మొదలుపెట్టాడు.

రామకోటి :- "డౌట్ ఏం లేదు రా! మనదే బెస్ట్ లైఫ్! చూడు... మనం ఎంత హాయిగా ఉన్నామో! కాలు మీద కాలు వేసుకుని పడుకుంటాం, అల గాలి కి తాగుతున్నాం. అదే వాళ్లు అయితే ఇప్పుడే క్లాస్‌లో కూర్చుని ఉంటారు. సార్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి... నోట్స్ రాయాలి... ఆ మ్యాథ్స్ సార్ వేసే పిచ్చి ప్రశ్నలు భరించాలి... అబ్బో! మన వల్ల కాదు రా! బాబు"

అని గర్వంగా గొప్ప చెప్పుకున్నాడు.

అంతలో పక్కనే నిలబడి ఉన్న సూర్య , ఫోన్‌లో తన అమ్మతో మాట్లాడుతున్నాడు.

అతని ముఖంలో మాత్రం అమాయకత్వం కాదు... నేరస్థుడి భయం కనిపిస్తోంది.

సూర్య వాళ్ళ అమ్మ ఎంతో ప్రేమ్ గా " ఏం చేస్తున్నావ్ చిన్న ! కాలేజీ నుండి వచ్చేసావ ?" అని అడిగింది అమాయకం గా పాపం వాళ్ళు విష్యం తెలియక

సూర్య :- "ఇప్పుడే వచ్చా అమ్మ... కాలేజ్ నుండి! నేను స్నానం చేసి నీకు మళ్లీ కాల్ చేస్తా. ఓకే బై!"

అని తన అమ్మ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేశాడు.

అది చూసిన అజయ్ నవ్వుకుంటూ అన్నాడు.

> "పాపం రా! ఇంకొంచెం మాట్లాడాల్సింది మీ అమ్మతో."

సూర్య వెంటనే మొహం చిట్లించాడు.

సూర్య:- "నేను ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే అసలు విషయం తెలిసిపోతుంది. కాలేజ్‌కి వెళ్లకుండా మీతో హాస్టల్‌లో ఉన్నానని తెలిస్తే ముందుగా నన్ను కాదు... నిన్నే తన్నుతుంది మా అమ్మ!"

అజయ్, రామకోటి ఇద్దరూ పెద్దగా నవ్వేశారు.

సూర్య ఇంకా బాధగా అన్నాడు.

సూర్య :- "స్కూల్‌లో ఉన్నప్పుడు నా అటెండెన్స్ 95% కంటే తక్కువ ఉండేది కాదు. ఇప్పుడు కాలేజ్‌లో 5% అంటున్నారు. నా జీవితమే ఇలా మారిపోతుందని ఊహించలేదు."

అతని బాధ విన్న అజయ్ వెంటనే రామకోటిని చూపిస్తూ అన్నాడు.

అజయ్ :- "రేయ్ కోటి! మన వల్ల చెడిపోతున్నాడంట రా ఈడు!"

రామకోటి ఒక్కసారిగా తిరిగి చూసి తీర్పు చెప్పే జడ్జిలా అన్నాడు.

"మన వల్ల కాదు... నీ వల్ల!"

అప్పుడు రామకోటి అన్నామాటలకి సూర్య ఇలా అన్నాడు :- " అది ....అదే నిజం .... వీడే చెడదోబాడు మనల్ని " అని అజయ్ వంక వేలు చూపించి మరి అన్నాడు

ఆ మాట విన్న అజయ్ గుండెలో బాణం దూసుకెళ్లినట్టైంది.

చేతిని గుండె మీద పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ డ్రామాటిక్‌గా అన్నాడు.

"జానకి... ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను!"

తర్వాత సూర్య వైపు తిరిగి,

"ఈరోజు నీ చికెన్ నాకు వేసేయమని చెప్పు ఇదే పెదరాయుడు చెప్పె ఆఖరి తీర్పు " అని

అన్నాడు అజయ్

సూర్య కోపంతో ఎర్రబడ్డాడు.

సూర్య :- "రేయ్! నా చికెన్ ఎందుకు ఇస్తా నీకు? ఒక్క ముక్క కూడా ఇవ్వను!"

అన్నాడు.

అజయ్ :- " అరుస్తున్నాడు భాయ్య ఈడు !!! " అని అన్నాడు

రామకోటి :- " వీడికి శిక్ష పడాల్సిందే ! " అని అన్నాడు

అలా అజయ్ ఒక నవ్వు నవ్వాడు

ఆ నవ్వు చూసి సూర్యకి ఎందుకో గుండెల్లో చిన్న అనుమానం మొదలైంది.

అంతే .....సూర్య అక్కడ నుండి పరుగులు తీసాడు... హాస్టల్ మొత్తం పరిగెత్తాడు.....

---

రాత్రి 7:30

హాస్టల్ మెస్ ముందు విద్యార్థుల రద్దీ.

అందరూ ప్లేట్లు పట్టుకుని లైన్లో నిలబడి ఉన్నారు.

అయితే...

ఆ రోజు ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది.

అజయ్, రామకోటి ఇద్దరూ వచ్చారు.

కానీ సూర్య కనిపించలేదు.

అసలు నిజం ఏంటంటే...

రూమ్‌లో సూర్యని బలవంతంగా మంచానికి కట్టేశారు.

చేతులు, కాళ్లు కట్టేసి బయటికి రానీయకుండా చేశారు.

అతని ప్లేట్ కూడా అజయ్ తీసుకొచ్చాడు.

చికెన్ వడ్డిస్తున్న మెస్ అన్నయ్య అడిగాడు.

"ఏమయ్యా కోటి... మీరే వచ్చారు? ఆ సూర్య ఎక్కడ?"

అజయ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేశాడు.

అజయ్ :- "వాడికి మోషన్స్ అవుతున్నాయి అన్నా. లేవలేకపోతున్నాడు. ఈరోజు వాడి చికెన్ నాకు వేసేయి. వాడికి ఈ ప్లేట్‌లో కొంచెం చారు పోస్తే చాలు."

అన్నాడు.

మెస్ అన్నయ్య కళ్లలో వెంటనే జాలి నిండిపోయింది.

> "అయ్యో పాపం! సీరియస్ అయితే వెంటనే నాకు ఫోన్ చేయండి రా. ఎమర్జెన్సీ అయితే నేను చూసుకుంటా."

అన్నాడు వాళ్ళు ఇద్దరు చేసిన పని తెలియక !

అజయ్, రామకోటి ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా అడిగారు.

> "ఎందుకు అన్నా? మా మీద నీకు ఇంత ప్రేమ?"

మెస్ అన్నయ్య బయటకు నవ్వాడు.

కానీ మనసులో మాత్రం...

"పిచ్చి పిల్లలు... ఎంత అమాయకంగా ఉన్నారో! వీళ్లు జీవితంలో ఎలా బ్రతుకుతారో ఏంటో "

అనుకున్నాడు.

---

కొద్ది సేపటికి...

సూర్య కోసం ప్రత్యేకంగా వండిన చికెన్ మొత్తం అజయ్,

రామకోటి ఇద్దరూ క్లీన్ చేశారు.

ఎముకలు కూడా మిగలకుండా తిన్నారు.

సూర్య ప్లేట్‌లో మాత్రం...

చారు అన్నం.

అంతే.

రూమ్‌కి తిరిగి వచ్చాక సూర్య ఆ దృశ్యం చూసి షాక్ అయ్యాడు.

"ఒరేయ్ దుర్మార్గులారా! నా చికెన్ తిన్నారా?"

అని అరిచాడు.

అజయ్ నోట్లో ఇంకా చికెన్ ముక్క ఉండగానే నవ్వాడు.

సూర్య కోపంతో కంపిస్తూ శాపం పెట్టాడు.

"మీరు తిన్న నా చికెన్ మీకు అరగదు! ఈ రాత్రే ఇద్దరికీ మోషన్స్ వస్తాయి! ఇదే నా శాపం!"

రామకోటి పెద్దగా నవ్వుకుంటూ అన్నాడు.

"ఎలాగో కాలేజ్‌కి వెళ్లలేదు. మోషన్స్ వచ్చినా బాత్రూమ్‌లోనే ఉండిపోతాం. కానీ నీ చికెన్ మాత్రం వదలము! ఈ వారమే కాదు వచ్చే వరం కూడా ! "

అని అన్నాడు.

ముగ్గురూ కొట్టుకునేంతగా గొడవపడ్డారు.

కానీ...

సూర్య కి వాడి చారు అన్నం ఇచ్చి , రామకోటి కట్టెలు విప్పాడు

---

ఇక్కడివరకు చెప్పి ఆగిపోయాడు అజయ్.

కథ వింటున్న తరిష్ అప్పటికే నవ్వి నవ్వి కడుపుబ్బిపోయాడు.

కళ్లలో నీళ్లు తుడుచుకుంటూ అడిగాడు.

"అయ్యా! తర్వాత ఏం జరిగింది? "

అని ఆసక్తిగా ముందుకు వంగాడు.

అజయ్ ముఖంపై నెమ్మదిగా ఒక చిలిపి నవ్వు కనిపించింది...

Hostel memories

By Writer_aj

Published: June 20, 2026 at 11:57 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...