Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
ఉదయం జరిగిన ఆ "జలయజ్ఞం" అప్పటికి అందరికీ ఒక సరదా సంఘటనగా అనిపించింది.
బకెట్లతో నీళ్లు పోసుకోవడం...
ట్యాంక్‌లో ముంచడం...
కాలువలో పడేయడం...
షర్ట్లు చింపేయడం...
ఇవి అన్నీ వాళ్లకు నవ్వులే.
కానీ...
వాళ్లకు తెలియకుండా ఆ వీడియోలు ఇప్పటికే తమ పని మొదలుపెట్టాయి.
ముందుగా...
హాస్టల్ వార్డెన్ మేడం ఫోన్‌లో ఆ వీడియోలు చేరాయి.
మేడం ఒక్కో వీడియో చూస్తూ...
మొదట ఆశ్చర్యపోయింది.
తర్వాత కోపం వచ్చింది.
చివరికి తల పట్టుకుంది.
ఒక వీడియోలో రుద్ర ప్రసాద్‌ని ట్యాంక్‌లో ముంచుతున్నారు.
మరో వీడియోలో వర్ధన్ కాలువలో
పడిపోయాడు.
ఇంకో వీడియోలో కారిడార్ మొత్తం నీళ్లతో నిండిపోయింది.
అందరూ అరిస్తూ...
పరుగులు తీస్తూ...
హాస్టల్‌ని యుద్ధభూమిలా మార్చేశారు.
"ఇది హాస్టలా?"
"లేక చేపల మార్కెటా?"
అని మేడం కోపంగా అనుకుంది.
ఇదే సమయంలో...
కాలేజ్‌లో కూడా ఆ వీడియోలు చేరాయి.
మొదట కొందరు స్టాఫ్ చూశారు.
తర్వాత మరికొందరు.
చివరికి...
విషయం ప్రిన్సిపాల్ టేబుల్ మీదకు వెళ్లింది.
అక్కడ కూడా వీడియోలు ప్లే అయ్యాయి.
కొంతమంది లెక్చరర్లు షాక్ అయ్యారు.
కొంతమంది నవ్వు ఆపుకున్నారు.
ఒక సర్ అయితే వీడియో చూస్తూ...
"ఇవ్వాళ క్లాస్‌లో కనిపించని వాళ్లు ఇక్కడ ఉన్నారే!"
అన్నారు.
అంతే.
ఇప్పుడు విషయం మరింత సీరియస్ అయింది.
అయితే...
ఈ మొత్తం కథలో ఒక విచిత్రమైన విషయం ఉంది.
ఈ సంఘటనకి అసలు మూలకారణం ఎవరు?
అజయ్.
మణికంఠ లు.
నీళ్ల యుద్ధం మొదలుపెట్టింది వాళ్లే.
మొదటి బకెట్ కుమ్మరించింది వాళ్లే.
హాస్టల్‌ని గందరగోళం చేసింది కూడా వాళ్లే.
కానీ...
విధి విచిత్రం.
వాళ్ల సీనియర్లు వీడియో తీయడం మొదలుపెట్టేసరికి...
అజయ్, మణికంఠల మొదటి అల్లరి మొత్తం అయిపోయింది.
వీడియోల్లో మిగతా వాళ్లు మాత్రమే స్పష్టంగా కనిపించారు.
అంటే...
యుద్ధం మొదలుపెట్టిన జనరల్స్ బయటపడ్డారు కాదు.
యుద్ధంలో చిక్కుకున్న సైనికులే దొరికారు.
అందుకే...
అజయ్ – సేఫ్.
మణికంఠ – సేఫ్.
ఇంకో కారణం కూడా ఉంది.
అజయ్ గురించి కాలేజ్ వాళ్లకి పెద్దగా తెలియదు.
ఎందుకంటే...
"అజయ్ ఎప్పుడైనా కాలేజ్‌కి వెళ్తే కదా గుర్తుపట్టడానికి!"
అనే పరిస్థితి.
కాలేజ్ రికార్డుల్లో పేరు ఉంటుంది.
కానీ ముఖం మాత్రం చాలామందికి తెలియదు.
అందుకే...
ఆ రోజు విచారణలో కూడా అతను నీడలాగే తిరిగాడు.
మరోవైపు...
దురదృష్టవశాత్తూ వీడియోల్లో స్పష్టంగా కనిపించిన వాళ్ల పరిస్థితి మాత్రం వేరేలా ఉంది.
కాలేజ్‌లో...
అశోక్.
చిన్ని.
కిరణ్.
పవన్.
ప్రమోద్.
రామకోటి.
రుద్ర.
వర్ధన్.
ఇలా కనిపించిన వాళ్లందరినీ పిలిపించారు.
స్టాఫ్ ముందు నిలబెట్టారు.
ఒక్కొక్కరికి ఒక్కో క్లాస్.
ఒక్కో డైలాగ్.
ఒక్కో తిట్టు.
రామకోటి అయితే తల వంచుకుని నిలబడ్డాడు.
నిన్న రాత్రే తండ్రి ఫోన్ చేసి...
జీవితం గురించి ఆలోచింపజేశాడు.
ఉదయం లేచి చదవడం కూడా మొదలుపెట్టాడు.
కానీ...
మారాలని అనుకున్న మొదటి రోజే...
ప్రిన్సిపాల్ ముందు నిలబడి తిట్లు తింటున్నాడు.
అతని మనసులో ఒక్కటే తిరుగుతోంది.
"నేను మారిపోదాం అనుకున్నా..."
"మరణించేలాగా వదలరు కదరా!"
అని అనుకున్నాడు.
మరోవైపు...
కాలేజ్‌కి వెళ్లని వాళ్ల పరిస్థితి హాస్టల్‌లో వేరేలా ఉంది.
వార్డెన్ మేడం అందరినీ ఆఫీస్ ముందు నిలబెట్టింది.
ఆమె కోపం చూసి...
కొంతమంది కళ్లెత్తి కూడా చూడలేదు.
ఆ రోజు మేడం నిఘంటువులో ఉన్న తిట్లన్నీ ఉపయోగించిందని కొందరు చెబుతారు.
"చదవడానికి పంపితే సర్కస్ చేస్తున్నారా?"
"హాస్టల్‌ని ఆటస్థలంగా మార్చేశారా?"
"ఇది చివరి హెచ్చరిక!"
అని వరుసగా క్లాస్ తీసుకుంది.
అయితే...
ఈ మొత్తం సమయంలో...
ఒక మూలన ఇద్దరు మహానుభావులు నిలబడి ఉన్నారు.
అజయ్.
మణికంఠ.
ముఖాల్లో అమాయకత్వం.
కళ్లలో నిర్దోషిత్వం.
వాళ్లు చూస్తుంటే...
ఈ సంఘటన గురించి ఇప్పుడే మొదటిసారి వింటున్నట్టుంది.
అజయ్ అయితే అప్పుడప్పుడు తల ఊపుతూ...
"చాలా తప్పు చేశారు..."
అన్నట్టుగా కూడా నటించాడు.
మణికంఠ కూడా...
"ఇంత దారుణంగా ఎలా చేశారు?"
అన్నట్టుగా ముఖం పెట్టుకున్నాడు.
కానీ...
వాళ్లిద్దరికీ తెలుసు.
ఈ కథ మొదటి పేజీ వాళ్లతోనే మొదలైందని.
ఇక కాలేజ్‌లో...
ప్రిన్సిపాల్ చివరగా హెచ్చరించాడు.
"రేపటి నుంచి అందరూ కాలేజ్‌కి రావాలి."
కొద్దిసేపు ఆగి...
"మా స్టాఫ్‌లో ఎవరో ఒకరు మీ హాస్టల్‌కి ఎప్పుడైనా రౌండ్స్‌కి వస్తారు."
"ఎవరు దొరికినా..."
అని మాట మధ్యలోనే ఆపాడు.
కానీ ఆ ఆపిన మాటే అందరికీ ఎక్కువ భయం వేసింది.
హాస్టల్‌లో...
వార్డెన్ మేడం కూడా చివరి వార్నింగ్ ఇచ్చింది.
"రేపే CCTVలు ఫిక్స్ చేయిస్తా."
"ఈసారి ఎవరు దొరికినా..."
"నేరుగా హాస్టల్ నుంచి బయటకు పంపిస్తా."
"జాగ్రత్త!"
అని చెప్పింది.
కొద్దిసేపటి తర్వాత...
ఒకవైపు ప్రిన్సిపాల్ రూమ్ నుంచి విద్యార్థులు బయటికి వచ్చారు.
మరోవైపు వార్డెన్ రూమ్ నుంచి హాస్టల్
బ్యాచ్ బయటికి వచ్చింది.
అందరూ తిట్లు తిన్నారు.
అందరూ వార్నింగులు విన్నారు.
అందరూ తలలు వంచి నిలబడ్డారు.
కానీ...
బయటకు వచ్చిన ఐదు నిమిషాల తర్వాత...
ఎవరో ఒకరు నవ్వారు.
మరొకరు నవ్వారు.
చివరికి...
అందరూ నవ్వడం మొదలుపెట్టారు.
"రుద్రని ఆరు సార్లు ముంచింది ఎవడ్రా?"
"వర్ధన్ మొహం గుర్తుందా కాలువలో పడినప్పుడు?"
"బాబూరావు షర్ట్ చింపేసిన సంఘటన గుర్తుందా?"
అంటూ మళ్లీ అదే కథలు మొదలయ్యాయి.
తిట్లు తిన్నా...
వార్నింగులు వచ్చినా...
భవిష్యత్తు గురించి క్లాసులు విన్నా...
ఈ బ్యాచ్‌లో ఒక విచిత్రమైన లక్షణం ఉంది.
ఒక గంట బాధపడతారు.
రెండు గంటలు భయపడతారు.
మూడో గంటకి మళ్లీ నవ్వేస్తారు.
అదే వాళ్ల బలం.
అదే వాళ్ల సమస్య.
మరి...
CCTVలు నిజంగానే పెట్టారా?
స్టాఫ్ నిజంగానే రౌండ్స్‌కి వచ్చారా?
Hostel memories
By Writer_aj
Published: June 24, 2026 at 12:21 PM
Your input calibrates the database for others.
Ready to play...